ఎన్టీఆర్ షోకు అతిథిగా రాజమౌళి ?

దర్శక ధీరుడు రాజమౌళి మాగ్నమ్ ఓపస్ “ఆర్ఆర్ఆర్” సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం ఆయన సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులను చూసుకుంటున్నారని కొందరు చెబుతున్నారు. షూటింగ్ పూర్తవ్వడంతో “ఆర్ఆర్ఆర్” పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆ పని కోసం రాజమౌళి అన్నపూర్ణ స్టూడియోస్‌లోకి అడుగు పెట్టారు. అయితే ఇప్పుడు రాజమౌళి అన్నపూర్ణ స్టూడియోలో కన్పించడం చర్చనీయంశంగా మారింది. దీనికి సంబంధించిన పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాదు ఆ పిక్ సరికొత్త అనుమానాలకు తెర తీస్తోంది.

Read Also : “హ్యాపీ 15 మై సన్”… గౌతమ్ కు మహేష్ విషెస్

రాజమౌళి కారు దిగి స్టూడియోలోకి వెళ్తున్నట్లుగా ఉన్న ఒక పిక్చర్, వీడియోను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆయన అన్నపూర్ణ స్టూడియోకి రావడం వెనుక కారణం ఏమిటనేది ఆసక్తికరంగా మారింది. తాజా బజ్ ప్రకారం యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న రియాలిటీ గేమ్ షో “ఎవరు మీలో కోటీశ్వరులు” షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది. ఈ షోలో రాజమౌళి అతిథిగా కనిపించబోతున్నారు. మరి ఇందులో నిజం ఎంతుందో తెలియదు. పైగా ఈ పిక్స్ లో మరో దర్శక దిగ్గజం రాఘవేంద్ర రావు కూడా కన్పించారు. ఆయన ఎన్టీఆర్ తో మాట్లాడుతూ ఉన్నారు.

Related Articles

Latest Articles

-Advertisement-