సల్మాన్ ను కలిసిన రాజమౌళి… ప్లాన్ ఏంటంటే ?

దర్శక దిగ్గజం రాజమౌళి ముంబైలో తాజాగా సల్మాన్ ను కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అసలు వీరిద్దరూ ఎందుకు కలిశారు ? సల్మాన్ ను రాజమౌళి ప్రత్యేకంగా కలవడానికి అసలు కారణం ఏంటి ? అనే విషయంపై టాలీవుడ్ లో చర్చ నడుస్తోంది. రాజమౌళి ప్రస్తుతం తన తాజా చిత్రం “ఆర్ఆర్ఆర్” ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. అది జనవరి 7న భారీ ఎత్తున విడుదల కానుంది. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్స్ పనుల్లో ముంబైలో బిజీగా ఉన్నాడు. ఈరోజు రాజమౌళి ముంబైలో సల్మాన్ సినిమా సెట్స్ లో కలిశారు. సల్మాన్‌, రాజమౌళి గంటకు పైగా సీరియస్‌గా చర్చించుకున్నారని ముంబై మీడియా చెబుతోంది. అందుకే ప్రతి ఒక్కరూ సమావేశం దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు.

Read Also : పిరికిపంద చర్య… కేంద్రంపై కంగనా ఫైర్

రాజమౌళిని తమ సినిమా ప్రమోషన్స్ చేయమని కోరేందుకు సల్మాన్ ఖాన్ వద్దకు వెళ్ళాడు అని ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఏదీ లేదు కానీ ఈ సినిమాను పెద్ద ఎత్తున విడుదల చేస్తుండడంతో ముంబైలో కూడా భారీగా ప్రమోషన్స్ చేయడానికి సిద్ధమవుతోంది. అందులో భాగంగానే సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ తో ప్రమోషన్ కార్యక్రమాలు జరిపిస్తే సినిమాకు కావాల్సినంత హైప్ పెరుగుతుందని అంటున్నారు. నిజంగానే అలా జరిగితే బాలీవుడ్ లో “ఆర్ఆర్ఆర్”కు తిరుగుండదు అని చెప్పొచ్చు.

Related Articles

Latest Articles