సోల్ ఆఫ్ ‘ఆర్ఆర్ఆర్’… ఈ ఒక్క సాంగ్ కే రెండు నెలలు !!

“ఆర్ఆర్ఆర్” సినిమా ప్రమోషన్లకు గ్రాండ్ లెవెల్లో సన్నాహాలు సిద్ధమవుతున్నాయి. ఈరోజు సోల్ ఆఫ్ ‘ఆర్ఆర్ఆర్’ సాంగ్ ‘జనని’కి సంబంధించి విలేఖరుల కోసం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు రాజమౌళి అండ్ టీం. ఈ సమావేశంలో విలేఖరులను ఎలాంటి ప్రశ్నలు అడగొద్దని రాజమౌళి రిక్వెస్ట్ చేశారు. ఎందుకంటే ఒకటొకటిగా ప్రశ్నలు అడగడం, వాటికి సమాధానాలు చెప్పుకుంటూ పోతే మ్యాటర్ ఎక్కడికో వెళ్తుందని, ఇది కేవలం ఈ సాంగ్ గురించేనని, ప్రమోషనల్ కార్యక్రమం కాదని క్లారిటీ ఇచ్చారు. ప్రమోషన్స్ అయితే ఆ హడావిడి వేరేగా ఉంటుందని, కానీ ఇప్పుడు మాత్రం ‘జనని’ సాంగ్ సోల్ ను ఫీల్ అవ్వమని సూచించారు రాజమౌళి. సెల్ ఫోన్లు, కెమెరాలు ఆపేయండి. అర్జెంటుగా తీసి పెట్టేయడానికి ఇదేమీ విజువల్స్ కాదు. జస్ట్ ఒక ఎమోషన్ అంతే. ఫస్ట్ మీకు మాత్రమే చూపిస్తున్నాము.

Read Also : “ఆర్ఆర్ఆర్” ట్రైలర్, వరుస ఈవెంట్స్.. హింట్ ఇచ్చిన రాజమౌళి

ప్రతి సినిమాకు కూడా మనం సినిమా దేని గురించి చూపిస్తున్నాము అనేది పట్టుకోవడం ప్రాసెస్ ఉంటుంది. ‘నాటు నాటు’ లాంటి మాస్ సాంగ్ కు కూడా ఒక ఎమోషన్ ఉంటుంది. ఈ సినిమాకు కూడా అదే జరిగింది. సినిమాకు మణిహారంలో దారం లాంటిది ‘జనని’ సాంగ్. సినిమా మొత్తానికి సోల్. రీరికార్డింగ్ ప్రాసెస్ ను బాగా ఎంజాయ్ చేస్తాను. పెద్దన్న 2 నెలలు రీరికార్డింగ్ చేశాక కూడా కోర్ కోసం సెర్చ్ చేశారు. ఎట్టకేలకు ఈ ఒకరోజు ఈ మెలోడీతో వచ్చారు అంటూ సాంగ్ సినిమాలో ఎంత ఇంపార్టెంట్ అనే విషయాన్నీ వెల్లడించారు.

Related Articles

Latest Articles