రాజమండ్రి – కాకినాడ నాన్‌స్టాప్‌ సర్వీసులు పునరుద్ధరణ…

నేటి నుంచి రాజమండ్రి – కాకినాడ నాన్‌స్టాప్‌ సర్వీసులు పునరుద్ధరణ జరిగింది. కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో ప్రభుత్వం కర్ఫ్యూ అమలు చేస్తుండడంతో గత కొన్ని రోజులుగా ఈ రూటులో నాన్ స్టాప్ సర్వీసులు నిలిచిపోయాయి. కాకినాడకు రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్‌ నుంచి ఉదయం 5.30కు తొలి సర్వీసు ప్రారంభం అయ్యింది. ఆఖరి సర్వీసు మధ్యాహ్నం 12.30కు బయలుదేరుతుంది. కాకినాడ డిపో నుంచి కూడా ఇదే సమయాల్లో రాజమండ్రికు నాన్‌స్టాప్‌ సర్వీసులు ప్రారంభం అయ్యాయి. ఇక ప్రతి 40 నిమిషాలకు ఒకటి చొప్పున మొత్తం 12 సర్వీసులు నడిపేందుకు ఏర్పాట్లు చేసారు అధికారులు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-