జనసేన కార్యక్రమానికి అడ్డంకులు లేవు-రాజమండ్రి ఏఎస్పీ

రాజమండ్రిలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ తలపెట్టిన బహిరంగసభ, శ్రమదానం కార్యక్రమంపై పలు ఆంక్షలు విధించారు పోలీసులు.. దీంతో.. శ్రమదానం కార్యక్రమం ప్లేస్‌ మార్చేశారు.. మరోవైపు.. ఈ కర్యక్రమానికి రాకుండా జనసేన కార్యకర్తలను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారి జనసైనికులు ఆరోపిస్తున్నారు.. ఈ వ్యవహారంపై క్లారిటీ ఇచ్చారు రాజమండ్రి ఏఎస్పీ కె. లతామధురి.. రాజమండ్రిలో జనసేన శ్రమదానం కార్యక్రమానికి పవన్ కల్యాణ్ రావడానికి ఎటువంటి అడ్డంకులు లేవని స్పష్టం చేశారు.. పవన్ కల్యాణ్ నేరుగా సభా ప్రాంగణానికి విచ్చేసి ప్రసంగిస్తారని తెలిపిన ఆమె.. జనసేనికులను పోలీసులు అడ్డుకుంటున్నారని అనడం అవాస్తవమని కొట్టిపారేశారు.. మరోవైపు.. పవన్ కల్యాణ్‌ సెక్యూరిటీ కోసమే బారికెడ్లు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు రాజమండ్రి ఏఎస్పీ కె. లతామధురి.

-Advertisement-జనసేన కార్యక్రమానికి అడ్డంకులు లేవు-రాజమండ్రి ఏఎస్పీ

Related Articles

Latest Articles