బండి సంజయ్… బండికి అడ్డువస్తే పగిలిపోతుంది : రాజాసింగ్

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్… బండికి అడ్డువస్తే పగిలిపోతుందని రాజా సింగ్ హెచ్చరించారు. బండి సంజయ్‌ పాదయాత్ర 100 కిలో మీటర్లు పూర్తి చేసుకున్న నేపథ్యం లో ఆయన మీడియాతో మాట్లాడారు. సంజయ్ పాదయాత్ర విజయవంతంగా సాగుతోందని… ప్రజలు స్వాగతం పలుకుతున్నారని వివరించారు. బండి సంజయ్ పై ప్రజల్లో ఎంత ప్రేమ ఉందొ స్పష్టం అవుతోందని… ఈ యాత్ర సక్సెస్ అయితే కేసీఆర్ ప్రభుత్వం పోతుంది… పేద ప్రజల బీజేపీ సర్కార్ వస్తుందని తెలిపారు. తప్పుడు నివేదికలతో హుజురాబాద ఉప ఎన్నిక ఆపారని.. కానీ.. అక్కడ ఎప్పుడు ఎన్నిక జరిగినా గెలిచేది బీజేపీనేనని స్పష్టం చేశారు రాజాసింగ్. డ్రగ్స్ కేసు విచారణలో రాజకీయ నాయకులు కూడా బయటకు వస్తారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీనేనన్నారు.

Related Articles

Latest Articles

-Advertisement-