బ్రోకర్లందరికీ శుభాకాంక్షలు : రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు

రైతు చట్టాలు రద్దు చేయడం పై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రధాని మోడీ రైతు చట్టాలు రద్దు చేశారని.. ఈ సందర్భంగా బ్రోకర్ లకు శుభాకాంక్షలు అంటూ రాజా సింగ్‌ పేర్కొన్నారు. రైతులకు మేలు జరగాలనే ప్రధాని మోడీ ఈ చట్టాలు తీసుకొచ్చారు… పంట అమ్ముకుంటే రైతులకు లాభం రావాలి కానీ బ్రోకర్లకు కాదన్నారు.

అందుకే ఈ వ్యవసాయ చట్టాలను తీసుకు వచ్చినట్లు స్పష్టం చేశారు రాజా సింగ్‌. అన్నదాతలు బ్రోకర్ల మాట నమ్మారని… నిరసనల వెనుక బ్రోకర్లు ఉన్నారని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు… నిధులు వారే ఇచ్చారు…సారా ప్యాకేట్స్ ఇచ్చారు అంత మనము చూశామన్నారు. దేశ వాతావరణం పాడుచేస్తున్నారని ప్రధాని మోడీ గమనించారని వెల్లడించారు.

రైతులే రాబోయే రోజుల్లో రైతు చట్టాలు కావాలని ప్రధాని మోడీ ని కోరుతారు…బ్రోకర్ లకు బుద్ధి చెబుతారని హెచ్చరించారు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్. కాగా…కాగా… ఇవాళ జాతిని ఉద్దేశించి… ఇవాళ ఉదయం 9 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంగించారు. ఈ సందర్భంగా ఆయన వ్యవసాయ చట్టాలపై కీలక ప్రకటన చేశారు. రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్న మూడు కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూన్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటన చేశారు. 

Related Articles

Latest Articles