కేసీఆర్ దగ్గర సబ్జెక్ట్ లేదు కాబట్టే ధర్నాలు చేస్తున్నాడు: రాజాసింగ్

రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేయాలంటూ గురువారం నాడు టీఆర్ఎస్ పార్టీ నేతలు ధర్నాలకు దిగిన విషయం తెలిసిందే. అయితే టీఆర్ఎస్ మహాధర్నా అంశంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ దగ్గర సబ్జెక్ట్ లేదని ఆయన ఆరోపించారు. ఆయన మెంటల్‌గా డిస్ట్రబ్ అయ్యాడని… అందుకే ధర్నాలు, రాస్తారోకోలు, ప్రొటెస్టులు అంటూ ఏదేదో చేస్తున్నాడని రాజాసింగ్ ఎద్దేవా చేశారు. హుజురాబాద్‌లో బీజేపీ దెబ్బకు కేసీఆర్ మైండ్ పనిచేయడం లేదని వ్యాఖ్యానించారు.

Read Also: అందుకే కుప్పంలో చంద్రబాబుకు ప్రజలు మొట్టికాయలు వేశారు: జగన్

కేంద్రం వడ్లు కొనుగోలు చేస్తామని చెప్తోందని… అయినా కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై ఎందుకు విమర్శలు చేస్తున్నారో అర్థం కావడంలేదని రాజాసింగ్ అన్నారు. అసెంబ్లీ సాక్షిగా రైతుల దగ్గర వడ్లు కొనుగోలు చేస్తామని కేసీఆర్ ప్రకటన చేశారని.. దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రైతుల దగ్గర ధాన్యం కొనాలని, కొత్త గోదాములు కట్టి అందులో ధాన్యం నిల్వ చేయాలని హితవు పలికారు. అయితే కేంద్రం సమయం వచ్చినప్పుడు ధాన్యం కొనుగోలు చేస్తుందని.. ఎంత కొనాలి, ఎప్పుడు కొనాలనే అంశంపై కేంద్రం పరిశీలన చేస్తోందని రాజాసింగ్ చెప్పారు. కేవలం కేసీఆర్ గ్రాఫ్ పడిపోతున్న కారణంగానే ఆందోళనలు నిర్వహిస్తున్నారని రాజాసింగ్ ఆరోపించారు.

Related Articles

Latest Articles