అక్టోబర్ 8న ఓటీటీలో ‘రాజ రాజ చోర’

తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ వంటి పలు భారతీయ భాషల్లో, రకరకాల జానర్లలో ఎప్పటికప్పుడు సరికొత్త వెబ్‌ సిరీస్‌, వెబ్ మూవీస్‌తో పాటు కొత్త సినిమాలను ప్రేక్షకులకు అందిస్తూ వస్తోంది జీ5. ఇటీవల ‘అలాంటి సిత్రాలు’ సినిమాను డైరెక్ట్ గా డిజిటల్ లోవిడుదల చేసిన ‘జీ 5’ విజయదశమి కానుకగా సూపర్ హిట్ సినిమా ‘రాజ రాజ చోర’ ను అందించబోతోంది. శ్రీ విష్ణు హీరోగా నటించిన చిత్రమిది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఆగస్టు 19న థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను నవ్వించడంతో పాటు చక్కటి సందేశాన్ని కూడా ఇచ్చింది.

Read Also : ‘వేధింపులు’ అంటూ సమంత స్టైలిస్ట్ షాకింగ్ పోస్ట్

ఇప్పుడు దసరా కానుకగా ఈ చిత్రాన్ని ‘జీ 5’ ఓటీటీలో విడుదల చేయనున్నారు. హసిత్ గోలి దర్శకుడిగా పరిచయమైన ఈ సినిమాలో దొంగ గా శ్రీ విష్ణు, అతని భార్యగా సునైన, ప్రేయసిగా మేఘా ఆకాష్, ఇతర పాత్రల్లో రవి బాబు, శ్రీకాంత్ అయ్యంగార్, అజయ్ ఘోష్, గంగవ్వ, తనికెళ్ల భరణి నటించారు. వివేక్ సాగర్ సంగీతం ఆకట్టుకుంది. విజయదశమి తర్వాత 22న ‘హెడ్స్ అండ్ టేల్స్’ సినిమాను డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల చేయనుంది జీ5. మరి ఈ సినిమాలకు ఓటీటీలో ఎలాంటి ఆదరణ దక్కుతుందో చూడాలి.

అక్టోబర్ 8న ఓటీటీలో 'రాజ రాజ చోర'
అక్టోబర్ 8న ఓటీటీలో 'రాజ రాజ చోర'
అక్టోబర్ 8న ఓటీటీలో 'రాజ రాజ చోర'
-Advertisement-అక్టోబర్ 8న ఓటీటీలో 'రాజ రాజ చోర'

Related Articles

Latest Articles