మాస్ మహారాజ రవితేజ ఆ యంగ్ హీరోకి ఛాన్స్ ఇచ్చాడా..?

గతేడాది క్రాక్ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న రవితేజ వరుస సినిమాలను సెట్స్ మీదకు తీసుకెళ్లి జోష్ పెంచాడు. ఇప్పటికే నాలుగు సినిమాలు సెట్స్ మీద ఉండగా.. మరో రెండు స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకుంటున్నాయి. ఇక త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న ‘ధమాకా’ చిత్రం ప్రస్తుతం షూటింగ్ ని జరుపుకొంటుంది. ఈ సినిమాలో రవితేజ సరసన పెళ్లి సందడి బ్యూటీ శ్రీ లీల నటిస్తోంది.

ఇక అందుతున్న సమాచారం బట్టి ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం యంగ్ హీరో రాజ్ తరుణ్ ని ఎంపిక చేసుకున్నారట. ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను యంగ్ హీరో చేస్తే బాగుంటుందని మేకర్స్ ఆలోచించి, దానికి రాజ్ తరుణ్ బెస్ట్ అనుకోని అతనిని తీసుకున్నారట.. రాజ్ తరుణ్ సైతం పాత్ర నచ్చడంతో వెంటనే ఓకే చెప్పినట్లు సమాచారం. ఇక రాజ్ తరుణ్ ప్రస్తుతం మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో మంచి పాత్ర దొరకడం.. అందులోను మాస్ మహారాజ రవితేజ తో స్క్రీన్ షేరింగ్ అంటే మాములుగా ఉండదు.. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను మేకర్స్ ఇవ్వనున్నారట. మరి ఈ సినిమాతో రాజ్ తరుణ్ దశ మారుతుందేమో చూడాలి.

Related Articles

Latest Articles