“జార్జ్ రెడ్డి”తో రాజ్ తరుణ్ మల్టీస్టారర్

యంగ్ ఎనర్జిటిక్ హీరో రాజ్ తరుణ్ మరో హీరోతో కలిసి మల్టీస్టారర్ చేయడానికి సిద్ధమయ్యాడు. “జార్జ్ రెడ్డి” ఫేమ్ సందీప్ మాధవ్ ఈ క్రేజీ మల్టీస్టారర్ లో మరో హీరోగా నటించబోతున్నారు. “మాస్ మహారాజు” అనే టైటిల్ తో రూపొందనున్న ఈ సినిమా సుధీర్ రాజు దర్శకత్వంలో రాబోతోంది. ఈ సినిమాను అక్టోబర్ 10న ప్రారంభం కానున్నట్టు సమాచారం. ఎం ఆషిఫ్ జానీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. నటీనటులు, సిబ్బంది గురించి మరిన్ని వివరాలు సినిమా లాంచ్ రోజున వెలువడతాయి. ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. త్వరలో చిత్రీకరణ ప్రారంభమవుతుంది.

Read also : నా క్రమశిక్షణకు విష్ణు వారసుడు: మోహన్ బాబు

ఇటీవల ‘పవర్ ప్లే’ అనే సీరియస్ క్రైమ్ జోనర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాజ్ తరుణ్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో చేతిలో రెండు ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో ఒకటి “స్టాండ్ అప్ రాహుల్”, మరొకటి “అనుభవించు రాజా”. ఈ రెండు సినిమాలూ కామెడీ ఎంటర్టైనర్లు కావడం విశేషం. రెండు సినిమాలు లైన్లో ఉండగానే మరో సినిమాకు సిద్ధమయ్యాడు రాజ్ తరుణ్. మరోవైపు “జార్జ్ రెడ్డి”తో గుర్తింపు తెచ్చుకున్న ఆ తరువాత మరే చిత్రంలోనూ కన్పించలేదు. వీరిద్దరి కాంబోలో వచ్చే చిత్రం ఎలా ఉంటుంది అన్నది చూడాలి.

-Advertisement-"జార్జ్ రెడ్డి"తో రాజ్ తరుణ్ మల్టీస్టారర్

Related Articles

Latest Articles