పోర్నోగ్రఫీ కేసు… రాజ్ కుంద్రా బిగ్గెస్ట్ కాంట్రవర్సీలు!

శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా పోర్న్ సినిమాలు చిత్రీకరిస్తున్నాడు అంటూ సోమవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయనకు జూలై 23 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది కోర్టు. వెబ్ సిరీస్ తో బ్రేక్ ఇస్తామని సాకుతో చిన్న ఆర్టిస్టులను ఆకర్షించారని పోలీసులు వెల్లడించారు. అంతేకాకుండా వారి ఇష్టానికి విరుద్ధంగా సెమీ న్యూడ్, న్యూడ్ సన్నివేశాలలు వంటివి చేయమని అడిగారట. వాస్తవానికి ఇప్పటికే బయటపడిన రాజ్ కుంద్రా చాట్ కూడా అశ్లీల కంటెంట్ ను చిత్రీకరించి పెద్ద మొత్తంలో డబ్బు లావాదేవీలు జరిపినట్టు వెల్లడించింది. రాజ్ కుంద్రా పరోక్షంగా కెన్రిన్ ప్రొడక్షన్ హౌస్ యజమాని, పెట్టుబడిదారుడు కూడా. కానీ కుంద్రా ఇలాంటి చట్టపరమైన ఇబ్బందుల్లో పడటం ఇదే మొదటిసారి కాదు. రాజ్ కుంద్రా ఇప్పటికి ఎన్ని కాంట్రవర్సిల్లో చిక్కుకున్నారో చూద్దాం.

1) బెట్టింగ్ కుంభకోణం
రాజస్థాన్ రాయల్స్ అనే ఐపిఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్)లో శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా తమ సొంత క్రికెట్ జట్టును స్థాపించారని అందరికీ తెలుసు. అందులో కుంద్రా 2013లో బెట్టింగ్ ఆరోపణలు ఎదుర్కొన్నాడు. దీంతో ఆ తరువాత ఆయన క్రికెట్‌కు సంబంధించిన ఏ కార్యకలాపాలకు పాల్పడకుండా నిషేధం విధించారు. అయితే 2018లో ఢిల్లీ పోలీసులు అతనికి క్లీన్ చిట్ ఇచ్చారు. ఆ తర్వాత ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రెండేళ్లపాటు సస్పెండ్ అయిన తరువాత రాజస్థాన్ రాయల్స్ జట్టు టోర్నమెంట్‌లో తిరిగి స్థానం సంపాదించారు. అనంతరం రాజ్, శిల్పా క్రికెట్ లీగ్‌తో తమ అనుబంధాన్ని ముగించారు.

2) పూనం పాండే ఆరోపణలు
ఈ ఏడాది ప్రారంభంలో పూనమ్ పాండే అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేసింది. ఆమె యాప్ ను రాజ్ సంస్థ నిర్వహించింది. కానీ వారితో పూనమ్ ఒప్పందం ముగిసిన తర్వాత కూడా రాజ్ ఆమె చిత్రాలను, వీడియోలనుయాప్ లో పోస్ట్ చేస్తూనే ఉన్నారు. అంతేకాకుండా కుంద్రా తన వ్యక్తిగత మొబైల్ నంబర్‌ను లీక్ చేసినట్లు కూడా పూనమ్ పాండే వెల్లడించింది. అయితే రాజ్ ఈ వాదనలన్నింటినీ కొట్టిపారేశాడు. తాను 201 లోనే ఆ సంస్థ నుండి నిష్క్రమించానని పేర్కొన్నాడు.

3) మాజీ భార్య మోసం చేసిందంటూ…
శిల్పా శెట్టి రాజ్ కుంద్రా రెండవ భార్య. ఇద్దరూ వివాహం చేసుకున్నప్పటి నుండి చాలా ఆమె మొదటి భార్య గురించి కథలు ప్రచారం జరిగాయి. అయితే ఇటీవలే రాజ్ తన మాజీ భార్యతో ఏమి జరిగిందో చెప్పుకొచ్చాడు. శిల్పా కారణంగానే రాజ్ తో తన వివాహం బంధం ముగిసిపోయిందని ఆయన మాజీ భార్య కవిత చెప్పింది. కానీ ఆమె ప్రకటనలకు విరుద్ధంగా రాజ్ మాజీ భార్య తన బావతో వివాహేతర సంబంధం పెట్టుకుందని ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

4) మనీలాండరింగ్ కేసు
మనీలాండరింగ్ కేసుకు సంబంధించి 2019లో రాజ్ కుంద్రాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించింది. డ్రగ్ పెడ్లర్ ఇక్బాల్ మిర్చికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన రియల్ ఎస్టేట్ ఏజెంట్ రంజీత్ బింద్రాతో రాజ్ డీలింగ్ చేశాడు. ఈ కేసులో కొన్ని గంటలు ప్రశ్నించింది. ఈ విచారణలో బింద్రాతో తన ఒప్పందం ప్రకారం బాస్టియన్ హాస్పిటాలిటీలో 50% వాటాను కొనుగోలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. తన గత లావాదేవీల గురించి తనకు తెలియదని రాజ్ పేర్కొన్నాడు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-