పోలీస్ కస్టడీకి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా

పోర్న్ వీడియోస్ కేసులో సోమవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేసిన ప్రముఖ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను ఈ రోజు కోర్టులో హాజరు పరిచారు. జూలై 23 వరకూ పోలీస్ కస్టడీ విధిస్తూ న్యాయమూర్తి ఇచ్చిన ఆదేశాల మేరకు రాజ్ కుంద్రాను బైకుల్లా జైలుకు మధ్యాహ్నం తరలించారు. ఈ మూడు రోజులు అక్కడే రాజ్ కుంద్రాను పోలీసులు విచారిస్తారు. 2021 ఫిబ్రవరిలో రాజ్ కుంద్రాపై ఆయన వ్యాపార భాగస్వాములు పోలీసు కేసు పెట్టారు. పోర్న్ వీడియోలను చిత్రీకరించి, కొన్ని యాప్స్ లో వాటిని రాజ్ కుంద్రా పబ్లిష్ చేయిస్తున్నట్టు తమ దగ్గర బలమైన ఆధారాలున్నాయని పోలీస్ కమీషనర్ సైతం గట్టిగా చెబుతుండటం విశేషం.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-