నా చెల్లి భర్తతో అలా… మాజీ భార్యపై శిల్పాశెట్టి భర్త కామెంట్స్

బాలీవుడ్ బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా తన మాజీ భార్య గురించి దాదాపు 12 సంవత్సరాల తర్వాత ఓపెన్ అయ్యారు. శిల్పాశెట్టి గురించి ఆయన మాజీ భార్య కవిత మాట్లాడిన ఓ పాత వీడియో ఇప్పుడు వైరల్ కావడంతో రాజ్ స్పందించారు. ఆ వీడియోలో రాజ్ తో తన రిలేషన్ ఫెయిల్ కావడానికి శిల్పాశెట్టి కారణం అని ఆరోపించింది. దీంతో రాజ్ తన మొదటి భార్య కవితతో విడిపోవడానికి గల కారణాలను చెబుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు. కొన్నేళ్ల క్రితం తాము లండన్లో ఉన్నప్పుడు తన తన చెల్లెలు, ఆమె భర్తతో తమతోనే ఉండేవారని… ఆ సమయంలో కవిత తన చెల్లెలి భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుందని, సీక్రెట్ గా ఎఫైర్ నడిపించింది అని రాజ్ కుంద్రా ఆరోపించడం హాట్ టాపిక్ గా మారింది. ఎఫైర్ విషయం తెలియడంతోనే తాను కవితతో విడాకులు తీసుకున్నానని, అంతే తప్ప ఇందులో శిల్ప ప్రమేయం ఏమాత్రం లేదని, అన్నీ తెలిసే శిల్పాశెట్టి తనను ప్రేమించి పెళ్లి చేసుకుందని ఆయన చెప్పుకొచ్చాడు. రాజ్ కుంద్రా తన మాజీ భార్యపై చేసిన కామెంట్స్ ఇప్పుడు బాలీవుడ్లో చర్చనీయాంశమయ్యాయి. కాగా రాజ్, కవిత 2003లో వివాహం చేసుకున్నారు. 2006లో విడాకులు తీసుకున్నారు. తరువాత రాజ్ 2009లో శిల్పాను వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం రాజ్-శిల్పాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-