రెడ్ అలర్ట్ : చెన్నైను ముంచ్చెత్తుతున్న వర్షాలు

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడి అల్పపీడనం వాయుగుండంగా మారి చెన్నైపై తన ప్రభావాన్ని చూపెడుతోంది. ఇప్పటికీ 10 రోజుల నుంచి ఎడతెరపిలేకుండా వర్షాలు కురియడంతో తమిళనాడులోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షితమైన ప్రాంతాలకు తరలించేందుకు సీఎం ఎంకే స్టాలిన్‌ చర్యలు తీసుకున్నారు.

అంతేకాకుండా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగిన సంప్రదించాలని సూచిస్తూ.. కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేశారు. అయితే కొన్ని ప్రాంతాల్లో ఇంట్లోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కొన్ని చోట్ల వర్షపు నీటిలో పాములు రావడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటు భయం గుప్పిట్లో ఉన్నారు.

Related Articles

Latest Articles