తెలంగాణ ప్రజలకు అలర్ట్.. నేడు, రేపు వడగళ్ల వర్షాలు

సంక్రాంతి సంబరాలకు సిద్ధమవుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ బ్యాడ్‌న్యూస్ చెప్పింది. తెలంగాణలో రాబోయే నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. ఆగ్నేయ దిశ నుంచి తెలంగాణలోకి బలంగా గాలులు వీస్తున్నాయని… ఈ నేపథ్యంలో ఆది, సోమవారాలలో ఉత్తర తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వడగళ్ల వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశముందని తెలిపింది.

Read Also: మందు బాటిల్ ముందేసుకుని నీతులు చెప్తున్న హాట్ బ్యూటీ

మరోవైపు తెలంగాణలో వర్షాభావ పరిస్థితుల కారణంగా చలి తీవ్రత తగ్గే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అభిప్రాయపడింది. ఆగ్నేయ, దక్షిణ దిశల నుంచి తెలంగాణ వైపు వీస్తున్న గాలుల కారణంగా చలితీవ్రత తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. అదే సమయంలో ఉత్తర భారతం నుంచి వీస్తున్న చల్లని గాలుల కారణంగా మంచు పొరలు ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది.

Related Articles

Latest Articles