పండుగ సందడికి బ్రేక్ వేస్తున్న వర్షం

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడడంతో ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఏపీలో సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. నేడు భోగి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు వేకుకవజామునే భోగి మంటలు వేసి చిన్నాపెద్దా తేడాలేకుండా ఆడిపాడారు. అయితే ఏపీ సీఎం క్యాంపు కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.

కానీ వరుణుడు విజృంభిస్తుండడంతో తాడేపల్లిలో సంక్రాంతి సంబరాలకు బ్రేక్‌ పడింది. ఇప్పటికే ఓ సారి వర్షం కురిసి ఆగిపోయింది. అయితే ఇప్పుడు మరోసారి వర్షం కురుస్తోంది. గోశాలలో నిర్వహిస్తున్న ఈ సంక్రాంతి సంబరాల్లో సీఎం జగన్‌ పాల్గొంటున్న నేపథ్యంలో కాసేపట్లో ప్రారంభం కావాల్సి ఉన్న సంక్రాంతి సంబరాలకు వర్షం వల్ల ఆటంకం ఏర్పడుతోంది.

Related Articles

Latest Articles