ఇవాళ బంగాళఖాతంలో అల్పపీడనం…తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఇవాళ బంగాళఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో.. భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అల్పపీడన ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు. రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు దంచి కొడుతున్నాయి.

read also : నేటి నుంచి ఆషాఢమాసం బోనాలు ప్రారంభం

ప్రధానంగా హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో కొద్దిరోజులుగా వానలు పడుతున్నాయి. ఈ తరుణంలో ఇవాళ బంగాళఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో మరిన్ని భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. దీని ప్రభావంతో తెలంగాణలో నేటి నుంచి 13వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

అటు, ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ కూడా వాతావరణ హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో అల్పపీడనం ఏర్పడనుందని, రాష్ట్రంలో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అదే సమయంలో తీర ప్రాంతాల్లో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని విపత్తుల శాఖ కమిషనర్ కె.కన్నబాబు వివరించారు. అల్పపీడన ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని స్పష్టం చేశారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-