బలపడిన అల్పపీడనం : మరో రెండు రోజులు వర్షాలు

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడటంతో… వచ్చే రెండు రోజులు ఏపీలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. 6 జిల్లాలకు రెడ్‌ అలర్ట్ జారీ చేసింది. మత్స్యకారులెవరూ సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. ఏపీలో వచ్చే రెండు రోజుల్లో ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడొచ్చంటోంది… వాతావరణ శాఖ. తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని… మత్స్యకారులు వేటకు వెళ్లడాన్ని నిషేధించామని అధికారులు తెలిపారు. తహసీల్దార్లు, ప్రభుత్వ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని… విశాఖ జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు.

ఏపీలో కాకినాడలో అత్యధికంగా 16 సెంటీమీటర్ల వర్షం పడింది. కాకినాడ ప్రభుత్వాస్పత్రి మాతాశిశు విభాగంలో నీరు చేరడంతో బాలింతలు, గర్భిణిలు ఇబ్బంది పడుతన్నారు. గర్భిణిల వార్డులకి కిటికీల ద్వార నీళ్లు రావడంతో… బెడ్స్‌ తడిసిపోయాయి. దాంతో ఒకే మంచాన్ని ముగ్గురు గర్భిణులకు కేటాయించారు. ఇక మెడికల్‌ స్టోర్‌లోకి కూడా నీళ్లు చేడంతో… మోటర్‌ సాయంతో నీళ్లు తోడేస్తున్నారు. తూర్పుగోదావరి, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోనూ వర్షాలు పడుతున్నాయి. విశాఖలో 5, కళింగపట్నంలో 4, తునిలో 3. నరసాపురం, విజయవాడల్లో రెండేసి సెంటీమీటర్ల మేర్థం పడింది. భారీ వర్షాలకు సీలేరు కాంప్లెక్స్‌లో వరద ప్రవాహం పెరుగుతోంది. డొంకరాయి జలాశయం నుంచి 6,500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.

Related Articles

Latest Articles

-Advertisement-