చట్టబద్ధమైన విచారణ ప్రారంభించాం : అశ్విని వైష్టవ్‌

పశ్చిమ బెంగాల్‌లో జరిగిన రైలు ప్రమాద సంఘటన స్థలాన్ని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైలు ప్రమాద ఘటనపై చట్టబద్ధమైన విచారణ ప్రారంభించామన్నారు. అంతేకాకుండా ప్రధాని మోడీ పరిస్థితిని సమీక్షిస్తున్నారన్నారు. రైలు ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడి ప్రార్థిస్తున్నానన్నారు. అయితే నిన్న సాయంత్రం రైలు పట్టాలు తప్పి 7గురు మృతి చెందిన సంఘటన పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో చోటు చేసుకుంది. గౌహతి-బికనీర్‌ ఎక్స్‌ప్రెస్‌ జలపైగురి జిల్లాలోని దోహోమోని ప్రాంతంలో పట్టాలు అదుపు తప్పింది. దీంతో రైలు 12 బోగీలు ఒకదానివెంట మరొకటి బోల్తా కొట్టాయి. అయితే ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 9కి చేరకుంది. వీరితో పాటు మరో 50 మందికి గాయాలైనట్లు అధికారులు వెల్లడించారు.

Related Articles

Latest Articles