గీతా ఆర్ట్స్ బ్యానర్ లో నాగార్జున డైరెక్టర్

కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కిన “మన్మథుడు-2” చిత్రాన్ని తెరకెక్కించాడు రాహుల్ రవీంద్రన్. అయితే ఈ చిత్రం నాగ్ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. అంతకుముందే మరో అక్కినేని హీరో సుశాంత్ తో “చిలసౌ” అంటూ హీరో నుంచి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు రాహుల్. ఆ చిత్రం మంచి హిట్ ను ఇవ్వడంతో నాగ్ తో “మన్మథుడు-2” చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా ఫ్లాప్ కావడంతో చాలా గ్యాప్ తీసుకున్న ఆయన తాజాగా మరో చిత్రాన్ని రూపొందించడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. గీతా ఆర్ట్స్ పతాకంపై ఓ ప్రేమకథను చిత్రీకరించనున్నారట. ఈ మేరకు ఇప్పటికే రాహుల్ గీతా ఆర్ట్స్ నిర్మాతలకు కథను వివరించాడట. గతంలో ఆయన లేడీ-ఓరియెంటెడ్ స్క్రిప్ట్‌ తో ముందుకు రాగా… అందులో ప్రధాన పాత్ర కోసం సమంతను అనుకున్నారు. అయితే ఇప్పుడు గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ కింద బన్నీ వాస్ నిర్మించాల్సిన విమెన్ సెంట్రిక్ చిత్రాన్ని పక్కన పెట్టి రాహుల్ ప్రేమకథతో ముందుకు వెళ్తున్నాడు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-