తెలంగాణ ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌గా ఉండాలి…రాహుల్ ట్వీట్‌…

తెలంగాణ‌లో గ‌త కొన్ని రోజులుగా వ‌ర్షాలు కురుస్తున్నాయి.  ఈ భారీ వ‌ర్షాల‌కు వాగులు, వంక‌లు పొంగి పొర్లుతున్నాయి.  గోదావ‌రి ఎగువ ప్రాంతాల్లో సైతం విస్తారంగా వ‌ర్షాలు కురుస్తుండ‌టంతో పరివాహ‌క ప్రాంతాల్లో నిర్మించిన ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేస్తున్నారు.  దీంతో దిగువ ప్రాంతాల్లోకి వ‌ర‌ద నీరు పోటేత్తింది.  ఒక‌వైపు ప్రాజెక్టుల నుంచి వ‌స్తున్న వ‌ర‌ద‌, మ‌రోవైపు భారీ వ‌ర్షాల కార‌ణంగా వ‌స్తున్న వ‌ర‌ద నీటితో తెలంగాణ ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నారు.  తెలంగాణ ప్ర‌జలు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని, మరికొన్ని రోజులు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉన్న‌ట్టు ఇప్ప‌టికే వాతావ‌ర‌ణ శాఖ హెచ్చిరించింద‌ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.  కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు ప్ర‌జ‌ల‌కు అవ‌సర‌మైన స‌హాయ స‌హ‌కారాలు అందించాల‌ని ఈ సంద‌ర్భంగా రాహుల్ గాంధీ కోరారు. 

Read: డిజిటల్ డెబ్యూట్ కు సిద్ధమవుతున్న అక్కినేని హీరో

-Advertisement-తెలంగాణ ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌గా ఉండాలి...రాహుల్ ట్వీట్‌...

Related Articles

Latest Articles