కేంద్రంపై రాహుల్ కీల‌క వ్యాఖ్య‌లు…

కేంద్ర తీసుకుంటున్న త‌ప్పుడు నిర్ణ‌యాల కార‌ణంగా దేశంలో విప‌త్క‌ర ప‌రిస్థితులు నెల‌కొన్నాయ‌ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపేర్కొన్నారు. దేశంలో ఇప్ప‌టి విప‌త్క‌ర ప‌రిస్థితుల‌కు ఎవ‌రు కార‌ణ‌మో అంద‌రికీ తెలుసున‌ని అన్నారు.  ద‌శాబ్ధాలుగా నిర్మించిన వాటిని కొన్ని సెకన్ల వ్య‌వ‌ధిలో కూల్చివేశార‌ని విమ‌ర్శలు చేశారు.  ఎల్ఒసీ, జ‌మ్మూకాశ్మీర్ స‌రిహ‌ద్దుల్లో వివాదాలు, నిత్య‌వ‌స‌ర ధ‌ర‌ల పెరుగుద‌ల‌, రైతుల క‌ష్టాలు, క‌రోనా వ్యాక్సిన్‌ల కొర‌త త‌దిత‌ర అంశాల‌కు కార‌ణం కేంద్రం తీసుకుంటున్న నిర్ణ‌యాలే అని అన్నారు.  కేంద్రం తీసుకున్న అనాలోచిత నిర్ణ‌యాల కార‌ణంగానే దేశం ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటోందని అన్నారు.  రాహుల్ గాంధీ ట్విట్ట‌ర్ వేదిక‌గా ఈ విమ‌ర్శలు చేశారు.  

Read: నేను చాలా రిచ్: ఆర్. నారాయణమూర్తి

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-