గ్యాస్ ధ‌ర‌ల పెరుగుద‌ల‌పై రాహుల్ గాంధీ ఆగ్ర‌హం…

దేశంలో మ‌రోసారి గ్యాస్ ధ‌ర‌లు పెరిగిన సంగ‌తి తెలిసిందే.  చ‌మురు కంపెనీలు ప్ర‌తినెలా స‌మీక్షించి ధ‌ర‌ల‌ను పెంచ‌డ‌మో లేదా త‌గ్గించ‌డ‌మో చేస్తుంటాయి.  అయితే, గ‌త కొన్ని నెల‌లుగా గ్యాస్ ధ‌ర‌లు పెరుగుతుండ‌టంతో ప్ర‌జలు ఆందోళ‌న చెందుతున్నారు.  సెప్టెంబ‌ర్ నెల‌లో వంట‌గ్యాస్ ధ‌ర‌ను రూ.25 పెంచ‌డంపై కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  2014 నుంచి దేశంలో గ్యాస్ ధ‌ర‌లు 116 శాతం పెరిగిన‌ట్టు రాహుల్ గాంధీ పేర్కొన్నారు.  యూపీఏ హ‌యాంలో క్రూడాయిల్ ధ‌ర 110 డాల‌ర్లు ఉండ‌గా, ఇప్పుడు క్రూడాయిల్ ధ‌ర 74 డాల‌ర్లే అని, అంత‌ర్జాతీయంగా చ‌మురు ధ‌ర‌లు త‌గ్గినప్ప‌టికీ దేశంలో పెట్రోల్ ధ‌ర‌లు త‌గ్గ‌డం లేద‌ని రాహుల్ గాంధీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  గ్యాస్‌, డీజిల్, పెట్రోల్ రూపంలో కేంద్రం రూ.23 ల‌క్ష‌ల కోట్లు సంపాదించింద‌ని, ఈ డ‌బ్బంతా స‌ర్కార్ ఎటు మ‌ళ్లిస్తుంద‌ని రాహుల్ గాంధీ ప్ర‌శ్నించారు.   

Read: ఒకే రైలు… రెండు వేగాలు… ఎలా సాధ్యం…

Related Articles

Latest Articles

-Advertisement-