ఏపీ కాంగ్రెస్‌పై రాహుల్ దృష్టి…

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రం విడిపోయాక ఏపీలో దారుణంగా దెబ్బ‌తిన్న‌ది.  2014, 2019 ఎన్నిక‌ల్లో ఆ పార్టీ ఒక్క సీటుకూడా గెలుచుకోలేక‌పోయింది.  ఆయితే, ప్ర‌స్తుతం దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని ప్ర‌క్షాళ‌న చేస్తున్న సంగ‌తి తెలిసిందే.  తెలంగాణ‌లో పార్టీ ప‌గ్గాలు రేవంత్‌కు అప్ప‌గించిన త‌రువాత కొంద దూకుడు పెరిగింది.  ఇప్పుడు ఏపీ కాంగ్రెస్‌లో కూడా ప్ర‌క్షాళ‌న చేసి కొత్త జ‌వ‌స‌త్వాలు నింపేందుకు పార్టీ అధిష్టానం పావులు క‌దుపుతున్న‌ది.  

Read: కొత్త సినిమా మొదలెట్టేసిన నయనతార

ఇందులో భాగంగానే, రానున్న 15 రోజుల్లో ఏపీ కాంగ్రెస్ నేత‌ల‌ను ఢిల్లీకి రావాల‌ని అధిష్టానం ఆదేశించిన‌ట్టు తెల‌స్తోంది.  ఏపీలో కాంగ్రెస్ తిరిగి పుంజుకోవాలంటే ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవాలి, ఎలా పార్టీని బ‌లోపేతం చేయాలి, ఒక‌వేళ పార్టీ నాయ‌క‌త్వాన్ని మారిస్తే ఏమైనా ఫ‌లితం ఉంటుందా?  మార్చాలి అని నిర్ణ‌యిస్తే ప‌గ్గాలు ఎవ‌రికి అప్ప‌గించాలి అనే విష‌యాల‌పై ఏపీ కాంగ్రెస్ ఇన్ చార్జ్ ఉమెన్ చాందీతో రాహుల్ గాంధీ చ‌ర్చించిన‌ట్టు స‌మాచారం.  ఆగ‌స్టు నెల‌లో ఏపీ కాంగ్రెస్ పార్టీని పూర్తిగా ప్ర‌క్షాళ‌న చేసి నూతన ఒర‌వ‌డిని తీసుకురావాల‌ని కాంగ్రెస్ అధిష్టానం చూస్తున్న‌ది. 

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-