న్యూజిలాండ్ ను ప్రశంసించిన ద్రావిడ్…

నిన్న న్యూజిలాండ్ తో జరిగిన టీ20 మ్యాచ్ లో విజయం సాధించి ఈ సిరీస్ ను 3-0 తో వైట్ వాష్ చేసింది భారత జట్టు. అయితే ఈ మ్యాచ్ అనంతరం భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ మాట్లాడుతూ… కివీస్ జట్టును ప్రశంసించారు. 6 రోజుల్లో మూడు మ్యాచ్ లు ఆడటం మాములు విషయం కాదు అని తెలిపారు. అయితే ఈ నెల 14న ఆస్ట్రేలియాతో ఐసీసీ టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ ఆడిన న్యూజిలాండ్ జట్టు ఆ తర్వాత ఇండియాకు వచ్చి… 17 నుంచి టీ20 సిరీస్ ప్రారంభించింది. ఇంత తక్కువ టైం లో ఇన్ని మ్యాచ్ లు ఆడటం… మాములు విషయం కాదు. అలాగే ఈ సిరీస్ లో తమ కెప్టెన్ కేన్ విలియమ్సన్ లేకపోయినా జట్టు బాగా పోరాడింది అని చెప్పారు.

అలాగే హెడ్ కోచ్ గా తన మొదటి సిరీస్ గెలవడం సంతోషంగా ఉంది అని చెప్పిన ద్రావిడ్ భారత ఆటగాళ్లకు ఎక్కువ సంబరపడకండి అని కూడా చెప్పాడు. ఎందుకంటే న్యూజిలాండ్ జట్టును టెస్ట్ సిరీస్ లో ఓడించడం చాలా కష్టం అని అన్నాడు. వారు టెస్ట్ ఛాంపియన్ షిప్ మ్యాచ్ లో 6 రోజులు ఆడారు. అంటేనే అర్ధం చేసుకోవచ్చు. కాబట్టి వారిని టెస్ట్ సిరీస్ లో ఓడించాలంటే చాలా కష్టపడాలి అని తెలిపారు ద్రావిడ్. అయితే ఈ నెల 25 నుండి భారత్ – కివీస్ మధ్య మొదటి టెస్ట్ ప్రారంభం కానుంది.

Related Articles

Latest Articles