ప్రధాని మోడీకి రఘురామ మరో లేఖ !

ఢిల్లీ : ప్రధానమంత్రి మోడీ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఆయనకు లేఖ రాశారు నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు. ధర్మ సంస్థాపన కోసం ఈ యుగం లో జన్మించిన వ్యక్తి మోడీ అని… చెడ్డా వారిని శిక్షించే బాధ్యత మోడీ దేనన్నారు. కోర్టులో మా ప్రభుత్వానికి
నిన్న రెండు మొట్టికాయలు పడ్డాయని… కనక రాజ్ ను పోలీస్ కంప్లైంట్ ఆథారీటీ చైర్మన్ గా నియామకం, రంగుల విషయములో కోర్టు తప్పుపట్టిందని తెలిపారు.

సుప్రీమ్ కోర్ట్, హై కోర్ట్ లో మొత్తం ఇప్పటిదాకా 190 కేసుల్లో మా ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిందని… ఈ మొత్తం కేసులు ఏందుకు పోయాయి ఇంత దారుణం గా అనే దానిపై ఒక కమిటీ వేస్తే బాగుంటుందని వివరించారు. తాను కాగ్ కు రాసిన లేఖ అధారం గానే రాష్ట్ర ప్రభుత్వం కు లేఖ రాసిందని…మా ప్రభుత్వం, ప్రజల కోసమే లేఖలు రాస్తున్నానని తెలిపారు. రాష్ట్రం లో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది కానీ మసి బుసి మారేడు చేసే ప్రయత్నం చేస్తున్నారని… మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు అలాంటిది అధికారులుకు బుద్ధి రావడం లేదని వైసీపీ పై మండిపడ్డారు రఘురామ కృష్ణంరాజు. టిటిడి కమిటీ ఏర్పాటులో హిందువుల మనోభావాలు దెబ్బతి న్నాయని… రెండు మూడు రోజుల్లో కోర్టులను కూడా ఆశ్రయిస్తానని హెచ్చరించారు.

-Advertisement-ప్రధాని మోడీకి రఘురామ మరో లేఖ !

Related Articles

Latest Articles