సీఎం కేసీఆర్, సజ్జనార్ లపై రఘరామ రాజు ప్రశంసలు

ఏపీ సర్కార్‌ పై మరోసారి ఫైర్‌ అయ్యారు నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు. ఏపీలో జగనన్న విద్యుత్ వాత అనే పథకాన్ని ప్రవేశపెట్టారని… ప్రస్తుతం జగనన్న విద్యుత్ వాత కాస్త కరెంట్ కొత అయ్యిందని జగన్‌ సర్కార్‌ పై ఫైర్‌ అయ్యారు సీఎం జగన్‌. శ్రీకాకుళం లో 6 గంటల నుండి 10 గంటల వరకు కరెంట్ కొత పెట్టారని.. త్వరలో రాష్ట్రం అంతటా ఉంటుందని మండిపడ్డారు. అదే పక్క రాష్ట్రం తెలంగాణలో విద్యుత్ కోత లేదని… రాయలసీమ థర్మల్ పవర్ ను మూసివేశారు….అది ఆత్మహత్య సదృశ్యం అవుతుందన్నారు.

అలాగే.. ఆర్టీసీ బస్సుల చార్జీలు పెంచారు, దసరా పేరు మీద కూడా దోచుకుంటున్నారని ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. తెలంగాణ లో ఆర్టీసి ఎండి సజ్జనర్ బస్సుల సంఖ్యను పెంచాలని అన్నారు..టికెట్ల రేట్లు మాత్రం పెంచలేదని గుర్తు చేశారు. ఈ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ కు, ఆర్టీసీ చైర్మన్ సజ్జనార్‌ లను తాను అభినందిస్తున్నానని తెలిపారు ఎంపీ రఘురామ కృష్ణరాజు. వైస్సార్ పెన్షన్ నెల నెల టెన్షన్ గా మారిందని… లక్ష మందికి పైగా వైఎస్‌ఆర్‌ పెన్షన్ నుండి తీసేశారని మండిపడ్డారు.

-Advertisement-సీఎం కేసీఆర్, సజ్జనార్ లపై రఘరామ రాజు ప్రశంసలు

Related Articles

Latest Articles