యష్ కూతురు క్యూట్ వీడియో వైరల్

స్టార్ హీరో యష్ “కేజిఎఫ్”తో పాన్ ఇండియా స్టార్ గా మారిన విషయం తెలిసిందే. ఆ ఒక్క సినిమాతోనే దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ ను సంపాదించారు యష్. ప్రస్తుతం ఇండియా మొత్తం ఆసక్తిగా, ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రాల జాబితాలో “కేజిఎఫ్-2” ప్రాజెక్ట్ కూడా ఉంది. అయితే తాజాగా యష్ కూతురుకు సంబంధించిన ఒక వీడియో వైరల్ గా మారింది. ఆయన భార్య రాధిక పండిట్ మంగళవారం తన కుమార్తె ఐరా క్యూట్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నారు. ఈ వీడియోలో ఐరా నడవడానికి ప్రయత్నిస్తోంది. కానీ ఆమె నడుస్తుండగా నీడ కంపించడంతో ఉత్సాహంగా అటువైపు తిరిగి తన నీడకు తనే హాయ్ చెప్తూ కన్పించింది. ప్రస్తుతం నెట్టింట్లో ఈ వీడియో వైరల్ అవుతోంది. యష్, రాధిక పండిట్ దంపతులకు ఐరా, యథర్వ్ ఇద్దరు పిల్లలు. 2018 లో ఐరా, 2019లో యథర్వ్ పుట్టారు.

View this post on Instagram

A post shared by Radhika Pandit (@iamradhikapandit)

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-