పోలీస్ కి భార్య, రౌడీ తరుఫు లాయర్… రాధికా ఆప్టే!

బీ-టౌన్ బ్యూటీస్ లో రాధికా ఆప్టే రూటు కాస్త సపరేటు! తెలుగులోనూ ప్రేక్షకుల్ని అలరించిన మరాఠీ బ్యూటీ రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్ కాదు. అలాగని అందానికి, గ్లామర్ కి కొదవేం ఉండదు. అయినా, రాధికా ఆప్టే ఓ సినిమాకి సై అనాలి అంటే అందులో ఎంతో కొంత ప్రత్యేకత ఉండాల్సిందే. తనకు నచ్చితేనే సినిమాలు, ఓటీటీ షోలు చేసే టాలెంటెడ్ బ్యూటీ లెటెస్ట్ గా మరో చిత్రానికి అంగీకారం తెలిపిందట!

Read Also: అనుష్క, భూమి పెడ్నేకర్ బాటలో కృతీ సనన్

హృతిక్, సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రల్లో తమిళ చిత్రం ‘విక్రమ్ వేద’కి హిందీ రీమేక్ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే, ఈ మల్టీ స్టారర్ లో రాధికా ఆప్టే కూడా నటించనుందట. ఫిల్మ్ మేకర్స్ ఆమెతో చర్చలు జరుపుతున్నారని సమాచారం. ఇంతకీ, రాధికా క్యారెక్టర్ ఏంటంటే… ఆమె ఓ లాయర్ గా ‘విక్రమ్ వేద’ బాలీవుడ్ వర్షన్ లో కనిపిస్తుందట. పోలీస్ పాత్ర చేస్తోన్న సైఫ్ కి వైఫ్ గానూ, గ్యాంగ్ స్టర్ క్యారెక్టర్ లో కనిపించే హృతిక్ కి లాయర్ గానూ రాధిక నటించబోతోందట! సినిమాలో ఆమె రోల్ కూడా కీలకమే అంటున్నారు డైరెక్టర్స్ పుష్కర్ అండ్ గాయత్రి. వాళ్లే తమిళంలోనూ ‘విక్రమ్ వేద’ 2017లో రూపొందించారు. చూడాలి మరి, హృతిక్, సైఫ్ అలీఖాన్ నడుమ మన ‘లెజెండ్’ లేడీ రాధికా ఆప్టే ఎలా తన సత్తా చాటుతుందో!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-