“రాధేశ్యామ్” టీజర్ కు ముహూర్తం ఖరారు

ఎట్టకేలకు ప్రభాస్ అభిమానుల నిరీక్షణ ముగియబోతోంది. “రాధే శ్యామ్” టీజర్ కోసం చాలా కాలంగా ఆరాటపడుతున్న రెబల్ స్టార్ అభిమానుల ఆశ నెరవేరే సమయం ఆసన్నమైంది. ఈ పాన్ ఇండియా లవ్ స్టోరీలో హీరోయిన్ గా నటిస్తున్న పూజాహెగ్డే పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ 13న ఓ పోస్టర్ ను విడుదల చేశారు. అందులో ప్రేరణకు పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ పూజాహెగ్డే ఏంజిల్ లా మెరిసిపోతున్న లుక్ విడుదల చేశారు. తాజాగా టీజర్ ను కూడా విడుదల చేయడానికి ‘రాధేశ్యామ్’ టీం పని సన్నాహాలు చేస్తోంది.

Read Also : “అన్ స్టాపబుల్” టాక్ షోకు బాలయ్య రెమ్యూనరేషన్ తెలుసా ?

అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ‘రాధే శ్యామ్’ టీజర్ విడుదల కానుంది అని సమాచారం. ఈ విషయంపై మేకర్స్ ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వకపోయినా అభిమానులు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చాలా కాలం నుంచి ఈ సినిమా అప్డేట్ కోసం ఎదురు చూస్తున్న ప్రభాస్ అభిమానులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇటీవల మేకర్స్ పై ఎలాంటి అప్డేట్ ఇవ్వట్లేదు అంటూ సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయ్యారు. మరి ‘రాధేశ్యామ్’ టీజర్ వారి అప్డేట్ కావాలన్న ఆకలిని తీరుస్తుందేమో చూడాలి.

Related Articles

Latest Articles