‘రాధేశ్యామ్’.. కలవని ఇరు ప్రేమికులా.. విడిపోని యాత్రికులా

ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన క్షణం రానే వచ్చింది. ఎన్నో రోజులుగా ఎదురుచూసిన రాధే శ్యామ్ ఫస్ట్ సింగిల్ ని ఎట్టకేలకు మేకర్స్ రిలీజ్ చేశారు. కొద్దిగా ఆలస్యం అయినా చిత్ర యూనిట్ చివరికి అభిమానుల కోరిక తీర్చారు. ‘ఈ రాతలే’ అంటూ సాగే ఈ పాట ఆద్యంతం ఆకట్టుకొంటుంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే కనిపిస్తుంది. పాన్ ఇండియాకు తగ్గట్టే పాత విజువల్స్, ఆ గ్రాండియర్ కనిపిస్తోంది.

ఎవరో వీరెవెరో .. కలవని ప్రేమికులా.. ఎవరో వీరెవెరో విడిపోని యాత్రికులా అంటూ ఇద్దరు ప్రేమికుల జీవితాన్ని ఈ రాతలు మార్చేశాయి అని చెప్పారు. పాటను చూస్తుంటే నిర్మాతలు వెనకాడలేదని తెలుస్తోంది. ఇక ఈ గీతానికి జస్టిన్‌ ప్రభాకరన్‌ స్వరాలందించగా.. యువన్‌ శంకర్‌ రాజా, హరిణి ఇవటూరి సంయుక్తంగా  ఆలపించారు. తెలుగు వెర్షన్‌కు కృష్ణకాంత్‌ సాహిత్యం అందించారు. 70 కాలంలో ప్రేమకథగా ఈ సినిమా రూపొందుతుండగా.. ఇందులో ప్రభాస్ విక్రమాదిత్య  హస్తసాముద్రికా నిపుణుడిగా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది.

Related Articles

Latest Articles