‘రాధే’ టైటిల్ ట్రాక్ వీడియో

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా ప్రభుదేవా తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘రాధే’. ‘యువర్ మోస్ట్ వాంటెడ్ బాయ్’ ట్యాగ్ లైన్. ప్రభుదేవా దర్శకత్వం వహించగా, సల్మాన్ ఖాన్, సోహైల్ ఖాన్, అతుల్ అగ్నిహోత్రి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో రణదీప్ హుడా, జాకీ ష్రాఫ్, మేఘా ఆకాష్ కీలక పాత్రల్లో నటించారు. ‘రాధే’ చిత్రం ఈ నెల 13న విడుదల కాబోతోంది. ఒకే రోజున ఇటు థియేటర్లలోనూ, అటు ఓటీటీలోనూ చూసేయొచ్చు. థియేటర్లతో పాటు జీ ప్లెక్స్ లోనూ పే పర్ వ్యూ బేసిస్ లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. జీ ప్లెక్స్ సంస్థ మూవీని చూడాలంటే రూ. 249 పే చేయాలని ప్రకటించింది. ఈ సినిమాకు ఒక్క కట్ కూడా లేకుండా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఈ చిత్రానికి ‘యుఎ’ను కేటాయించింది. ఇప్పటికే విడుదలైన ‘రాధే’ ట్రైలర్, అందులోని సీటీమార్, దిల్ దే దియా పాటలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి ‘రాధే’ టైటిల్ ట్రాక్ కు సంబంధించిన వీడియో ను విడుదల చేశారు. ఈ టైటిల్ ట్రాక్ ఇప్పుడు యూట్యూబ్ లో హల్చల్ చేస్తోంది. సల్మాన్ ఖాన్, దిశాలపై చిత్రీకరించిన ఈ సాంగ్ ను సాజిద్ పాడాడు. మీరు కూడా ‘రాధే’ టైటిల్ ట్రాక్ వీడియోను వీక్షించండి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-