ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… త్వరలో బిగ్ అప్డేట్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు తీపికబురు అందించాడు దర్శకుడు రాధాకృష్ణ. పాన్ ఇండియా రొమాంటిక్ డ్రామా “రాధే శ్యామ్” అప్‌డేట్ కోసం ఎంతోకాలం నుంచి ఓపికగా ఎదురు చూస్తున్న ప్రభాస్ అభిమానులకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. ఈ చిత్ర దర్శకుడు రాధా కృష్ణ కుమార్ ఈ రోజు “త్వరలోనే అప్డేట్” అని ట్వీట్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “రాధే శ్యామ్ చివరి షెడ్యూల్‌తో అన్నీ పూర్తయ్యాయి. మా డార్లింగ్ అభిమానులందరికీ నా ప్రేమను వ్యాప్తి చేశాను !! ఈ మహమ్మారి మా అంచనాలన్నింటినీ దెబ్బతీసింది !! త్వరలోనే అప్డేట్” రానుంది అని ట్వీట్ చేశారు. దీంతో నెట్టింట్లో ప్రభాస్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

Read Also : ‘లైగర్’ బ్యూటీ అనన్య తండ్రి చంకీ పాండే, విజయ్ గురించి ఏమన్నాడంటే…

ప్రభాస్, పూజాహెగ్డే జంటగా నటిస్తున్న పీరియాడిక్ రొమాంటిక్ ఎంటర్టైనర్ “రాధే శ్యామ్”. రాధాకృష్ణ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, టి-సిరీస్, గోపికృష్ణ మూవీస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇటీవల కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తగ్గిన వెంటనే ఈ భారీ బడ్జెట్ చిత్రం షూటింగ్ ను తిరిగి ప్రారంభించారు మేకర్స్. ఎట్టకేలకు సినిమా షూటింగ్ పూర్తి చేసి, అప్డేట్స్ ఇవ్వడానికి మేకర్స్ నిర్ణయించుకోవడం ప్రభాస్ ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది. మరో రెండ్రోజుల్లో సినిమా పోస్టర్ రిలీజ్ అవుతుందని, అందులో సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. సమాచారం ప్రకారం సినిమా 2022 సంక్రాంతి బరిలో నిలిచే అవకాశం ఉంది. అయితే ఈసారి సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ వద్ద భారీ పోటీ నెలకొంటుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ “అయ్యప్పనుమ్ కోషియమ్”, అలాగే మహేష్ బాబు “సర్కారు వారు పాట”ను కూడా సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించేశారు. మరోవైపు “ప్రాజెక్ట్ కే”, “సలార్”, “ఆదిపురుష్”లతో ప్రభాస్ బిజీగా ఉన్నారు.

Related Articles

Latest Articles

-Advertisement-