రాధేశ్యామ్: ‘నగుమోము తారలే’ ప్రోమో రిలీజ్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ వేయి కళ్ళతో ఎదురుచూస్తున్న చిత్రం ‘రాధే శ్యామ్’. రాధాకృష్ణ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14 న విడుదలకు సిద్దమవుతుంది. ఇక ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ల జోరును పెంచేశారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి రెండో సింగిల్ ” నగుమోము తారలే” అంటూ సాగే పాటను విడుదల చేసారు.

‘వన్ హార్ట్ టూ హార్ట్ బీట్స్’ పేరుతో రిలీజ్ చేసిన పోస్టర్ కు మంచి స్పందన వచ్చిన విషయం తెలిసిందే.. ఇక తాజాగా టీజర్ కూడా ఆద్యంతం ఆకట్టుకొంటుంది. తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో జస్టిన్ ప్రభాకర్ సంగీతం అందించిన ఈ పాటకు కృష్ణ కాంత్ లిరిక్స్ సమకూర్చగా సిద్ శ్రీరామ్ ఆలపించారు. ఇక ఈ చిన్న టీజర్ లో లిరిక్స్ లేకుండా మ్యూజిక్ తోనే పూజా, ప్రభాస్ ల మధ్య ప్రేమ గాఢతను చూపించారు. వర్షంలో పూజ కోసం బైక్ పై ప్రభాస్ వెయిట్ చేయడం, సముద్ర తీరాన ప్రభాస్ క్లాస్ లుక్ లో నడుచుకు రావడం, అందమైన లొకేషన్స్ లో హీరోహీరోయిన్ల మధ్య రొమాన్స్ ని ఎంతో అద్భుతంగా ఆవిష్కరించారు. ఈ లవ్ ఆంథమ్ ఫుల్ సాంగ్ ని డిసెంబర్ 1 న విడుదల చేయన్నున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది.

Related Articles

Latest Articles