టిప్పు సుల్తాన్‌.. స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు : ప్రొద్దుటూరు ఎమ్మెల్యే

ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్‌రెడ్డి షాకింగ్ కామెంట్స్‌ చేశారు. బిజెపి టిప్పు సుల్లాన్ విగ్ర‌హాన్ని అడ్డం పెట్టుకుని రాజ‌కీయం చేస్తోందని.. ప్రశాంతంగా ఉన్న ప్రొద్దుటూరులో మ‌త సామార‌స్యానికి విఘాతం క‌లిగించేలా ప్ర‌వ‌ర్తిస్తోందని మండిపడ్డారు. నేను బిజెపీకి వివ‌ర‌ణ ఇవ్వ‌డం లేదని.. ప్రొద్దుటూరులోని క్రైస్త‌వుల‌కు, హిందువుల‌కు వివ‌ర‌ణ ఇస్తున్నానని స్పష్టం చేశారు. శ్రీ‌రంగ ప‌ట్నాన్ని రాజ‌ధానిగా చేసుకుని పాలించిన రాజు టిప్పు సుల్తాన్‌ అని.. మైసూరును ఆక్ర‌మించుకునేందుకు బ్రిటీష్ వారు వ‌స్తే వ్య‌తిరేకంగా పోరాటం చేసిన భార‌తీయుడు టిప్పు సుల్తాన్‌ తెలిపారు. దేశం కోసం టిప్పు సుల్లాన్ నాలుగు యుద్ధాలు చేశాడు…రెండు యుద్ధాల్లో గెలిచి, రెండు యద్ధాల్లో ఓడిపోయాడని తెలిపారు. చివ‌ర‌కు బ్రిటీష‌ర్ల చేతిలో చ‌నిపోయిన స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు అని… బ్రిటీష‌ర్‌తో ఎవ‌రు కొట్లాడిన ఏ భార‌తీయుడైనా నా దృష్టిలో దేశ భ‌క్తుడే అని పేర్కొన్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-