కరోనా కంటే ముందే అది వారిని చంపేస్తుంది… రాశిఖన్నా వీడియో

కరోనా కారణంగా ఎంతోమంది ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా పేదవారు… లాక్ డౌన్ వల్ల చేయడానికి పనిలేక, తినడానికి తిండి లేక ఎంతోమంది పస్తులు ఉంటున్నారు. వారి గురించి తాజాగా హీరోయిన్ రాశిఖన్నా ఓ వీడియోను షేర్ చేశారు. “ఈరోజు లక్షలాది మంది బ్రతకడానికి ఆహారమే ఆక్సిజన్ లా తయారయింది. ఈ మహమ్మారి తెచ్చిన ఏడుపుల ముందు ఆకలి కేకలు వినిపించకుండా పోయాయి. బహుశా ఆకలే వారిని కరోనా వైరస్ కంటే ముందు చంపేస్తుందేమో. జీవనాధారం కోల్పోయి సంపాదన తగ్గిపోయి, ప్రాథమిక ఆహరం కూడా కరువైపోయి ఎన్నో పేద కుటుంబాలు ఈ మహమ్మారి సెకండ్ వేవ్ లో ఆకలితో పస్తులు ఉంటూ జీవితాలు గడుపుతున్నాయి. సహాయ సంస్థలు ఈ కరోనా సమయంలో పని చేస్తూనే ఉన్నారు. ఆకలితో అలమటించే వారికి సహాయం చేస్తున్నారు. అయితే సహాయ సంస్థలు నిధుల కొరత ఎదుర్కొంటున్నాయి. నేను కూడా ఈ మధ్య రోటి బ్యాంక్ అనే సంస్థతో సమయం గడుపుతున్నాను. వారి నినాదం ప్రకారం మీరు వంద మందికి భోజనం అందించలేకపోయినా, ఒకరికి అందించండి. ఇప్పుడు వారికి మన సహాయం అవసరం. మన హృదయాలను తెరచి చూడాల్సిన సమయం వచ్చేసింది. అలాగే మన వంతు సహాయం అందించాలి” అంటూ ఈ కష్ట సమయంలో పేదల కష్టాలను కళ్ళకు కట్టే వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో రాశిఖన్నా కూడా కొంతమందికి సహాయం అందించడం మనం చూడొచ్చు.

“2వ వేవ్ సమయంలో ఎక్కువ కుటుంబాలు ఆకలితో పోరాడుతున్నాయి. కేవలం రూ.40తో మీరు రోటీ బ్యాంక్ ద్వారా ఒక ఆకలితో ఉన్న కడుపుకు తిండి సహాయం చేయవచ్చు. రోటీ బ్యాంక్ చేస్తున్న అద్భుతమైన పనికి నేను మద్దతు ఇస్తున్నాను. వీలైతే దయచేసి మీరు కూడా వారికి కూడా వారికీ మద్దతు ఇవ్వండి” అంటూ రిక్వెస్ట్ చేసింది రాశి ఖన్నా. మొన్నటి వరకూ విదేశాలలో సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న రాశి ఖన్నా ఇటీవలే తిరిగి భారతదేశానికి వచ్చారు. ఆమె ఇక్కడ దిగిన వెంటనే ఆమె దానధర్మాలు చేయడం ప్రారంభించింది. కరోనా సమయంలో సెలబ్రిటీ హోదాను కలిగి ఉండటం అర్థవంతంగా ఉంటుందని, ముఖ్యంగా సహాయం కోసం ముందుకు వస్తున్న వారికి అని ఆమె చెప్పింది. ప్రస్తుతం ఈ నటి నాగ చైతన్యతో కలిసి “థాంక్స్” చిత్రంలో నటిస్తోంది. మలయాళంలో “అంధాధున్” రీమేక్, షాహిద్ కపూర్ తో హిందీలో కూడా ఒక చిత్రం చేస్తోంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-