అంత మాట అంటే.. ఇక కుర్రాళ్లు ఆగుతారా రాశీ..

టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతోంది బబ్లీ బ్యూటీ రాశీ ఖన్నా. చక్కనమ్మ చిక్కినా అందమే అన్నట్లు ఇటీవల కొంచెం సన్నబడిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. ప్రస్తుతం తెలుగులో గోపీచంద్ సరసన ‘పక్కా కమర్షియల్’ చిత్రంలో నటిస్తుంది. మరోపక్క బాలీవుడ్ లో కూడా మంచి ఛాన్సులు పట్టేస్తుంది. ఇక సోషల్ మీడియాలో అమ్మడి కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ మాములుగా ఉండదు. నిత్యం హాట్ ఫోటోషూట్లతో పిచ్చెక్కించే ఈ ముద్దుగుమ్మ పండగపూట కూడా మరో హాట్ ఫోటో పోస్ట్ చేసింది. అయితే ఈ ఫోటోకు రాశీ పెట్టిన క్యాప్షన్ మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

బ్యాక్ లెస్ ఫోటో షేర్ చేస్తూ..” నా బ్యాక్ మీ కత్తిని బాధపెడుతుందా” అని రాసుకొచ్చింది. దీంతో కుర్రాళ్లు రాశీని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అమ్మడు ఏ విధంగా అన్నాడో తెలియదు కానీ ఫ్యాన్స్ మాత్రం ఇంకో విధంగా అర్థం చేసుకొని కామెంట్స్ తో విరుచుకుపడ్డారు. ఏంటీ రాశీ .. పండగపూట ఏంటా మాటలు..? అని కొందరు. రాశీ .. ఇలాంటి మాట మాట్లాడితే కుర్రాళ్ళు ఇక ఆగుతారా అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.

Related Articles

Latest Articles