కరణ్ జోహార్ కాంపౌండ్ లో రాశి ఖన్నా

రాశి ఖన్నా 2013లో ‘మద్రాస్ కేఫ్‌’తో హిందీ తెరంగేట్రం చేసింది. కానీ వెంటనే ఆమె దక్షిణాదికి చేరి, ఇక్కడ మంచి ఆఫర్లు రావడంతో బాలీవుడ్‌కు తిరిగి వెళ్లలేదు. ఇప్పుడు మరోసారి బి-టౌన్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఆలోచిస్తున్న రాశి వరుసగా సినిమాలకు సైన్ చేస్తోంది. ఇప్పటికే రాశి ఓ అమెజాన్ ప్రైమ్ వీడియో వెబ్ సిరీస్‌లో కథానాయికగా నటిస్తోంది. దీనికి రాజ్ అండ్ డికె దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తుండగా, విజయ్ సేతుపతి కీలక పాత్రలో కనిపించనున్నాడు. మరోవైపు రాశి అజయ్ దేవగన్ వెబ్ సిరీస్ ‘రుద్ర’లో కూడా నటిస్తోంది. ఇది డిస్నీ+హాట్‌స్టార్ లో విడుదల కానుంది.

Read Also : ప్రెస్ మీట్ లో బోరున ఏడ్చేసిన హీరో… అభిమానులకు రిక్వెస్ట్

ఇప్పుడు ఈ బ్యూటీ కరణ్ జోహార్ క్యాంపులో చేరిందని వినికిడి. కరణ్ నిర్మిస్తున్న యాక్షన్ ఫిల్మ్ ఫ్రాంచైజీ ‘యోధా’లో ఆమె కూడా ఒక హీరోయిన్ గా కనిపిస్తుంది. ఇందులో సిద్ధార్థ్ మల్హోత్రా కథానాయకుడు. ఈ చిత్రంలో దిశా పటాని మరో కథానాయికగా నటిస్తోంది. ‘యోధా’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను తాజాగా ఆవిష్కరించారు. పోస్టర్‌తో పాటు కరణ్ ట్వీట్ చేస్తూ “యోధా 2022 నవంబర్ 11 మీ స్క్రీన్‌లను హైజాక్ చేయడానికి వస్తోంది. సాగర్ అంబ్రే, పుష్కర్ ఓజా దర్శకత్వం వహించారు” అంటూ రిలీజ్ డేట్ ను ప్రకటించారు. సాధారణంగా కరణ్‌ ప్రొడక్షన్స్‌లో నటించే హీరోయిన్లకు బాలీవుడ్‌లో మంచి కెరీర్‌ ఉంటుంది. ఇప్పుడు రాశి కరణ్ కాంపౌండ్ లో చేరడం ఆమె అభిమానులకు గుడ్ న్యూస్.

Related Articles

Latest Articles