వైరల్.. ఆర్టీసీ బస్సులో ఆర్.నారాయణమూర్తి

తెలుగు సినిమా రంగంలో నటుడు ఆర్.నారాయణమూర్తికి ప్రత్యేక స్థానం ఉంటుంది. జన్మించింది ఏపీలోనే అయినా తెలంగాణ జీవన విధానంలోనే ఎక్కువగా ఆయన గడిపారు. తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడి మండలం మల్లంపేటలో జన్మించిన ఆర్.నారాయణమూర్తి ఎక్కువగా గ్రామీణుల నేపథ్యంలోనే అనేక సినిమాలను నిర్మించి దర్శకత్వం వహించారు. కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉండే ఆయన విప్లవాత్మక సినిమాలు తీయడంలో దిట్ట.

ఎక్కువగా కమ్యూనిస్టు భావ‌జాలం ఉన్న నారాయ‌ణ‌మూర్తి సోమవారం నాడు ప‌ర‌కాల ఆర్టీసీ బ‌స్సులో ప్ర‌యాణించారు. దీంతో బస్సులోని కండ‌క్ట‌ర్ ఆర్.నారాయణమూర్తితో సెల్ఫీ తీసుకున్నారు. ఈ ఫోటోను కండక్టర్ ఎంతో ప్రేమ‌తో ట్విట్ట‌ర్‌లో పోస్టు చేసి.. ఎర్ర‌బ‌స్సులో ఎర్ర జెండా క్యాప్ష‌న్‌తో పోస్టు చేశారు. ఇప్పుడీ ఫొటో సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ సందర్భంగా ఆర్.నారాయణమూర్తి సింప్లిసీటీని నెటిజన్లు పొగుడ్తున్నారు.

Related Articles

Latest Articles