ఆస్పత్రిలో చేరిన ఆర్. కృష్ణయ్య.. !

బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య ఆస్పత్రిలో చేరారు. స్పృహ తప్పి పడిపోయిన ఆర్.కృష్ణయ్య ను ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్ బషీర్ బాగ్ లోని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించింది బీసీ సంక్షేమ సంఘం. అయితే.. ఈ ధర్నాలో బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య కూడా పాల్గొన్నారు. మోడల్ స్కూల్స్ లో పని చేసే గెస్ట్ టీచర్స్ ఆందోళన కు మద్దతు తెలుపుతూ…ఈ ధర్నాలో పాల్గొన్నారు ఆర్. కృష్ణయ్య. ఈ నేపథ్యం లో కాస్త అస్వస్థతకు గురైన ఆర్‌. కృష్ణయ్య… స్పృహ తప్పి పడిపోయారు. దీంతో హుటా హుటిన కృష్ణయ్య ను ఆసుపత్రికి తరలించారు బిసి సంఘం నాయకులు. ప్రస్తుతం ఆయన ఓ ప్రైవేట్‌ ఆస్పత్రి లో ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఇంకా ఈ ఘటన కు సంబంధించిన విషయాలు తెలియాల్సి ఉంది.

Related Articles

Latest Articles

-Advertisement-