ఐపీఎల్ లో నేడు క్వాలిఫైయర్ 1 మ్యాచ్

ఐపీఎల్‌లో అసలు సమరం మొదలవుతోంది. లీగ్ దశ ముగియడంతో ప్లే ఆఫ్ పైట్‌కు నాలుగు జట్లు సిద్ధమయ్యాయి. ఢిల్లీ, చెన్నై, బెంగుళూర్, కోల్‌కతాల్లో ఎవరు తుది సమరంలో తలపడతారోననే ఆసక్తి నెలకొంది. మొదటి రెండు స్థానాల్లో నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఈరోజు క్వాలిఫైయర్ మ్యాచ్ జరగనుంది. ఆటలో అసలు మజాకు వేళైంది. నేటి నుంచి ప్లే ఆఫ్స్‌ జరగనున్నాయి. ఢిల్లీ, చెన్నై పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలవగా.. బెంగళూరు, కోల్‌కతా జట్లు మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. ఇవాళ తొలి క్వాలిఫయర్‌లో ఢిల్లీ, చెన్నై పోటీపడనున్నాయి. ఎవరు గెలిచినా నేరుగా ఫైనల్‌ చేరుకుంటారు.

ఓడిన జట్టు రెండో క్వాలిఫయర్‌లో అవకాశం ఉంటుంది. ఇవాళ జరిగే మ్యాచ్ మరింత ఆసక్తికరంగా ఉండబోతుంది. ఐపీఎల్‌లో తిరుగులేని జట్టుగా కనిపించే చెన్నై, ఈ సీజన్‌లో హైలైట్‌గా నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడుతోంది. వరుసగా మూడు ఓటములతో సతమతమవుతున్న ధోనీసేన ప్రస్తుతం పూర్తి బలంగా ఉన్న ఢిల్లీని ఓడించడం అంత తేలిక కాదు. ఈసారి ఓడిపోతే .. రెండో క్వాలిఫయర్‌ తో అదృష్టం పరిక్షీంచుకోవాలి. గత ఐపీఎల్‌లో ప్లే ఆఫ్స్ కూడా చేరని చెన్నై ఈసారి కసిగా ఆడింది. ఢిల్లీతో సమానంగా విజయాలు సాధించింది. అయితే చివరి మూడు మ్యాచుల్లో ఓటమితో కంగుతింది. ఈ మ్యాచుల్లో తక్కువే స్కోర్ చేయడంతో ఈ సారి చెన్నై ఎలా తలపడుతుందా అన్న ఆసక్తి నెలకొంది.

-Advertisement-ఐపీఎల్ లో నేడు క్వాలిఫైయర్  1 మ్యాచ్

Related Articles

Latest Articles