స్టేడియంల‌లో ఈ స్టేడియం వేర‌యా… ఎందుకో తెలుసా?

ఇప్పుడు ప్ర‌తి ఒక్క‌టీ కూడా యూజ్ అండ్ త్రోగా మారిపోయింది.  ప్ర‌తిదీకూడా ఇన్‌స్టెంట్‌గా మార్కెట్‌లో దొరుకుతున్నాయి.  అవ‌స‌రానికి అనుగుణంగా మార్పులు చేసుకొని వినియోగించుకొని త‌రువాత ప‌క్క‌న పెట్టేస్తారు.  వాడిన త‌రువాత వాటిని తిరిగి మ‌రో అవ‌స‌రం కోసం దానిక‌నుగుణంగా మార్చుకొవ‌డం ప‌రిపాటి.  అయితే, ఇప్పుడు ఈ యూజ్ అండ్ యూజ్ విధానాన్ని ఖ‌త‌ర్ అందుబాటులోకి తీసుకొచ్చింది.  ఈ యూజ్ అండ్ యూజ్ విధానంలో ఖ‌త‌ర్‌లో ఓ స్టేడియాన్ని నిర్మిస్తున్నారు.   వ‌చ్చే ప్ర‌పంచ సాక‌ర్ క్రీడ‌లు ఖ‌త‌ర్‌లో జ‌ర‌గ‌బోతున్నాయి.  దీనికోసం ఆ దేశంలో రాస్ అబు అబౌడ్ అనే స్టేడియాన్ని నిర్మిస్తున్నారు.  

Read: ఆహాలో రాబోతున్న కన్నడ ‘హీరో’!

మామూలు స్టేడియంలో మైదానంతో పాటుగా కుర్చీలు, సీలింగ్ వంటి వ‌స్తువులు ఉంటాయి.  కానీ, రాస్ అబు అబౌడ్ స్టేడియం అలా కాదు.  ఈ స్డేడియంలో మ్యాచ్‌లు పూరైన త‌రువాత కుర్చీలు, సీలింగ్‌లు అన్ని విప్పేసుకొని తీసుకొని వెళ్లిపోతారు.  కేవ‌లం అక్క‌డ మైదానం మాత్ర‌మే ఉంటుంది.  దోహా షిప్పింగ్ హార్బ‌ర్‌లో ఉన్న 974 కంటైన‌ర్ల‌ను తీసుకొని స్టేడియంను ఏర్పాటు చేస్తున్నారు.  కంటైన‌ర్ల‌లోని ఇనుమును తీసుకొని ఈ స్టేడియంను నిర్మిస్తున్నారు.  ఇందులో మొత్తం 40వేల సీటింగ్ సామ‌ర్ధ్యంతో స్టేడియంను నిర్మిస్తున్నారు. గేమ్స్ పూరైన త‌రువాత వీటిని విప్పేసి మ‌రోక దానికోసం వినియోగించుకోవ‌చ్చు.  

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-