ఇండియా ఓపెన్ నుంచి పీవీ సింధు ఔట్

ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్ పీవీ సింధు కథ ముగిసింది. మరోసారి టైటిల్ గెలిచే అవకాశాన్ని పీవీ సింధు చేజార్చుకుంది. శనివారం జరిగిన సెమీస్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన సుపానిడా కటేథాంగ్ చేతిలో సింధు ఓటమిపాలైంది. 14-21, 21-13, 10-21 స్కోరు తేడాతో మ్యాచ్ కోల్పోయింది. దీంతో ఇండియా ఓపెన్ టోర్నీ టైటిల్ రేసు నుంచి నిష్క్రమించింది.

Read Also: బిగ్ బ్రేకింగ్: టెస్ట్ కెప్టెన్సీకి విరాట్ కోహ్లీ గుడ్‌బై..!!

కాగా శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో సహచర షట్లర్‌ అస్మిత చాలిహపై 21-7, 21-18 తేడాతో పీవీ సింధు సునాయ‌స విజయం సాధించింది. కేవలం 36 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో ప్రపంచ 7వ ర్యాంకర్‌ పీవీ సింధు తన ప్రత్యర్ధిపై పూర్తి ఆధిపత్యం చలాయించి సెమీఫైనల్ చేరింది. కానీ సెమీఫైనల్లో ఓడిపోయి మరోసారి భారత అభిమానులను సింధు నిరాశపరిచింది.

Related Articles

Latest Articles