ఇండియన్ ఓపెన్‌ సెమీస్‌కు దూసుకెళ్లిన పీవీ సింధు

భారత బ్మాడ్మింటన్ స్టార్ ప్లేయర్ పీవీ సింధు మరోసారి అదరగొట్టింది. ఇండియన్ ఓపెన్-2022లో భాగంగా క్వార్టర్ ఫైనల్‌లో అశ్మిత చలిహా క్రీడాకారిణిని వరుసగా రెండు సెట్లలోనూ పీవీ సింధు ఓడించింది. తొలి సెట్‌లో 21-7 తేడాతో, రెండో సెట్‌లో 21-18 పాయింట్ల తేడాతో పీవీ సింధు విజయం సాధించింది. ఈ క్వార్టర్స్‌ గెలుపుతో పీవీ సింధు సెమీస్ బెర్తును సొంతం చేసుకుంది.

Read Also: కేప్‌టౌన్ టెస్టులో టీమిండియా ఓటమి.. సిరీస్ సమర్పయామి

అంతకుముందు మ్యాచ్‌లో ఏరా శర్మపై పీవీ సింధు విజయం సాధించి క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. ప్రత్యర్థి ఈరా శర్మను 21-10, 21-10 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించిన పివి సింధు… నేరుగా క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. దీంతో శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లోనూ సింధు అద్భుతంగా ఆడి అశ్వితపై విజయం సాధించింది.

Related Articles

Latest Articles