మ‌ళ్లీ చైనాలో లాక్‌డౌన్‌… ఆ న‌గ‌రం పూర్తిగా మూసివేత‌…

చైనాలో మ‌ళ్లీ క‌రోనా కేసులు పెరుగుతున్నాయి.  డెల్టా వేరియంట్‌తో పాటుగా మ‌రికొన్ని వేరియంట్లు అక్క‌డ చైనాలో వెలుగుచూస్తున్నాయి.  దీంతో మ‌రోసారి ఆంక్ష‌లు విధేంచేందుకు అక్క‌డి ప్ర‌భుత్వం సిద్ధం అయింది.  పూజియాన్ ప్రావిన్స్‌లోని పుతియాన్ న‌గ‌రంలో 19 క‌రోనా కేసులు వెలుగుచూశాయి.  క‌రోనా కేసులు వెలుగుచూడ‌టంతో ఆ న‌గ‌రంలో ఆంక్ష‌లు విధించారు.  ఆదివారం నుంచి ఆ న‌గ‌రాన్ని పూర్తిగా మూసివేశారు.  ఇళ్ల నుంచి ఎవ‌రూ బ‌య‌ట‌కు రాకూడ‌ద‌ని ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది.  అత్య‌వ‌స‌రంగా ఎవ‌రైనా బ‌య‌ట‌కు రావాలి అంటే త‌ప్ప‌నిస‌రిగా 48 గంట‌ల ముందు తీసుకున్న నెగెటిర‌వ్ రిపోర్ట్ స‌ర్టిఫికెట్ ఉండాలని, అప్పుడే బ‌య‌ట‌కు రావాల్సి ఉంటుంద‌ని ప్ర‌భుత్వం పేర్కొన్న‌ది. ర‌ష్యా, మ‌య‌మ్నార్ త‌దిత‌ర దేశాల నుంచి వ‌స్తున్న వ్య‌క్తుల నుంచి క‌రోనా విస్త‌రిస్తున్న‌ట్టు ప్ర‌భుత్వం గుర్తించింది.  

Read: ద‌ట్ ఈజ్ విమెన్ ప‌వ‌ర్‌: ధైర్యంగా ఉద్యోగాల్లో చేరిన ఆఫ్ఘ‌న్ మ‌హిళ‌లు…

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-