‘పుష్పక విమానం’ వచ్చేస్తోంది!

స్టార్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా ‘దొరసాని’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు ఆనంద్. తొలి చిత్రంతోనే నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక రెండో సినిమా ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’తో తనలోని కామెడీ టైమింగ్ ను తెలియచేశాడు. ఓటీటీలో విడుదలైన ఈ సినిమా అన్ని వర్గాలను ఆకట్టుకోవడం విశేషం.

ఇక ఆనంద్ దేవరకొండ హీరోగా రూపుదిద్దుకున్న మూడో చిత్రం ‘పుష్పక విమానం’ ఇప్పటికే విడుదల కావాల్సింది. కానీ కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు దాని విడుదలను ప్రొడ్యూసర్స్ వాయిదా వేస్తూ వచ్చారు. మొత్తానికి ఈ ‘పుష్పక విమానం’ ఆగమనాన్ని అడ్డుగా ఉన్న మేఘాలన్నీ తొలగిపోయాయి. ఈ కాన్సెప్ట్ బేస్డ్ మూవీని నవంబర్ 12న థియేటర్లలో విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు తెలిపారు. దామోదర ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘పుష్పక విమానం’మూవీని గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్ దషి ,ప్రదీప్ ఎర్రబెల్లి నిర్మించారు.

ఈ మూవీ గురించి దర్శకుడు మాట్లాడుతూ, ”ఇందులో ఆనంద్ గవర్నమెంట్ స్కూల్ టీచర్ గా నటిస్తున్నాడు. ఈ కథ మధ్యతరగతి కుటుంబాలలో వుండే డ్రామాని గుర్తుచేస్తూ , పెళ్లి చుట్టూ వుండే పరిస్థితులని చూపెడుతుంది. సునీల్, నరేష్, హర్షవర్థన్, గిరిధర్, కిరీటి, భద్రం, వైవా హర్ష, అభిజిత్, అజయ్, సుదర్శన్, శరణ్య ఇతర ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. శాన్వి మేఘన, గీత్ సాయిని హీరోయిన్స్ గా నటించారు” అని అన్నారు. రామ్ మిరియాల, సిద్దార్థ్ సదాశివుని, అమిత్ దాసాని సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకు విజయ్ దేవరకొండ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు.

-Advertisement-'పుష్పక విమానం' వచ్చేస్తోంది!

Related Articles

Latest Articles