ట్రెండింగ్ లో ‘పుష్ప’… కౌంట్ డౌన్ స్టార్ట్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ “పుష్ప”. రష్మిక మందన్న హీరోయిన్ గా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్, సునీల్ కీలకపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను డిసెంబర్ 17న ఇండియాలోని ఐదు ప్రధాన భాషల్లో విడుదల చేయబోతున్నారు. ఇటీవలే సినిమా హిందీ వెర్షన్ రిలీజ్ కు సంబంధించిన సమస్యలు కూడా తీరిపోయినట్టు వార్తలు వచ్చాయి. కానీ హిందీ మార్కెట్ ఇంకా డల్ గానే ఉంది. అక్కడ ‘పుష్ప’ మేకర్స్ ఇంకా ప్రమోషన్ కార్యక్రమాలను ఇంకా ప్రారంభించలేదు. త్వరలోనే హిందీ రిలీజ్ కు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను భారీ ఎత్తున స్టార్ట్ చేయనున్నారు మేకర్స్.

Read Also : ‘జై భీమ్’ కాంట్రవర్సీపై కమెడియన్ షాకింగ్ కామెంట్స్

అయితే తాజాగా ‘పుష్ప’ అనే హ్యాష్ ట్యాగ్ తో అభిమానులు ట్విట్టర్ లో కౌంట్ డౌన్ ను స్టార్ట్ చేశారు. సినిమా విడుదలకు నేటితో సరిగ్గా నెల రోజులే ఉంది. కరెక్టుగా సినిమా వచ్చే నెల ఇదే రోజున థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో బన్నీ అభిమానులు ‘పుష్ప’ను ట్రెండ్ చేస్తున్నారు. దీన్ని బట్టి సినిమా రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇక సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన సాంగ్స్ కు మంచి స్పందన వచ్చింది. నవంబర్ 17న ‘పుష్ప’ నాలుగవ సాంగ్ ‘ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా’ అనే సాంగ్ ను విడుదల చేయనున్నారు.

Related Articles

Latest Articles