తమిళ తంబీలకు దగ్గరయ్యే ప్రయత్నంలో బన్నీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు సౌత్ ప్రేక్షకుల్లో అశేషమైన అభిమానం, క్రేజ్ ఉంది. అటు నార్త్ లోనూ అల్లు అర్జున్ స్టైల్, డ్యాన్స్ కు హృతిక్ రోషన్, వరుణ్ ధావన్ వంటి స్టార్ హీరోలంతా ఫిదా అవుతారు. అలా అప్పుడప్పుడూ బాలీవుడ్ లోనూ ఎంతో కొంత బన్నీ ప్రసక్తి వస్తుంది. ఇక మలయాళంలో మన హీరోకు ఉన్న క్రేజ్ వేరు. అక్కడ ఆయన ఇప్పటి వరకూ కనీసం ఒక్క సినిమాలోనూ నటించకపోయినప్పటికీ బన్నీకి మాలీవుడ్ లో ఉన్న డై హార్డ్ ఫ్యాన్స్ సంఖ్య భారీగానే ఉంది. తమిళంలో మాత్రం అల్లు అర్జున్ ప్రభావం పెద్దగా లేదనే చెప్పాలి. అయితే ఇప్పుడు తమిళ తంబీలకు దగ్గరయ్యే ప్రయత్నంలో ఉన్నాడు బన్నీ. దానికి కారణం ఆయన ఇప్పుడు నటిస్తున్న “పుష్ప” అనే పాన్ ఇండియా మూవీ. ఈ మేరకు “పుష్ప” ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేశారు.

Read also : మహేష్ బాబు “అన్‌స్టాపబుల్”… బాబాయ్, అబ్బాయ్ లతో సూపర్ ఫన్

సుకుమార్ దర్శకత్వంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న యాక్షన్ డ్రామా “పుష్ప : ది రైజ్” ట్రైలర్ డిసెంబర్ 6న విడుదల కానుందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. రేపు చెన్నైలో ట్రైలర్ లాంచ్ కార్యక్రమం జరుగుతుందని ఈరోజు ఉదయం “పుష్ప” మేకర్స్ స్పష్టం చేశారు. అల్లు అర్జున్ గత కొన్ని నెలలుగా “పుష్ప” షూటింగ్‌లో ఉన్నాడు. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం “పుష్ప: ది రైజ్” క్రిస్మస్ సందర్భంగా ఈ మాగ్నమ్ ఓపస్ మూవీ ఈ ఏడాది డిసెంబర్ 17న ఐదు భాషల్లో విడుదల కానుంది.

ఆంధ్రప్రదేశ్‌ లోని రాయలసీమ ప్రాంతంలోని శేషాచలం కొండల్లోని ఎర్రచందనం స్మగ్లర్ల జీవితాల ఆధారంగా తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్‌లో శ్రీవల్లి పాత్రలో రష్మిక నటిస్తుండగా, అల్లు అర్జున్ పుష్పరాజ్ పాత్రను పోషిస్తున్నారు. పుష్ప మేకర్స్ ఇటీవల సమంతా రూత్ ప్రభుతో ఐటమ్ సాంగ్ ను చిత్రీకరించారు. శుక్రవారం మేకర్స్ ట్రైలర్ కు సంబంధించిన 30 సెకన్ల వీడియోను విడుదల చేసారు. ఆ వీడియో చూస్తుంటే ట్రైలర్ అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.

Related Articles

Latest Articles