‘పుష్ప’రాజ్ తొందర… ‘అఖండ’కంటే ముందరే !!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప” అన్ని భాషల్లోనూ దూసుకెళ్తోంది. ఈ సినిమాకు హిందీలో మంచి ఆదరణ లభిస్తోంది. అయితే తాజాగా ‘పుష్ప’ ఓటిటి ప్రీమియర్ పై అధికారిక ప్రకటన వచ్చింది. ‘పుష్ప’ జనవరి 7 రాత్రి 8 గంటల నుంచి అమెజాన్ ప్రైమ్ లో ప్రసారం కానుందని మేకర్స్ ఈరోజు ప్రకటించారు. సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ‘పుష్ప’ ఓటిటి ప్రీమియర్ కానుంది. అయితే హిందీ వెర్షన్ ను మాత్రం ఇప్పుడే ఓటిటిలో విడుదల చేయడం లేదు. హిందీలో సినిమా ఇంకా మంచి కలెక్షన్స్ రాబడుతుండడంతో మరో రెండు వారాల తరువాత హిందీ వెర్షన్ అందుబాటులోకి వస్తుందని ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా ‘పుష్ప’రాజ్ తొందర పడుతున్నాడని అభిమానులు అంటున్నారు. ఎందుకంటే ‘పుష్ప’ కంటే ముందు థియేటర్లలోకి వచ్చిన బాలయ్య బ్లాక్ బస్టర్ మూవీ ‘అఖండ’ ఇంకా ఓటిటిలో రాలేదు. కానీ ‘అఖండ’ కంటే ముందే ‘పుష్ప’రాజ్ ఓటిటిలో కనిపించబోతున్నాడు.

Read Also : మీకు, మీ డ్రైవర్ కు తేడా లేదా ?… పేర్ని నానికి ఆర్జీవీ కౌంటర్

నందమూరి బాలకృష్ణకు బోయపాటి శ్రీను మరోమారు ‘అఖండ’తో అద్భుతమైన విజయాన్ని అందించారు. ఈ సినిమాకు థమన్ సంగీతం కూడా తోడు కావడం మరో హైలెట్. ‘అఖండ’ డిసెంబర్ 2న విడుదలైన ‘అఖండ’ ఫుల్ స్పీడ్ తో దూసుకెళ్తోంది. అయితే ఈ సినిమాను కూడా ఓటిటిలో విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమయ్యారు. ఈ చిత్రం డిస్నీ హాట్ స్టార్ లో జనవరి 14న ప్రసారం కానుంది. అయితే ‘పుష్ప’ కంటే ముందే థియేటర్లను ఢీకొట్టిన ‘అఖండ’… ఓటిటిలో మాత్రం ‘పుష్ప’ తరువాతే రాబోతుండడం గమనార్హం. దీంతో ‘పుష్ప’రాజ్ కు అంత తొందర దేనికో ప్రేక్షకులకు అర్థం కావట్లేదు !!

Related Articles

Latest Articles